అక్రమార్కులకు ఝలక్ ఇస్తున్న హైడ్రా

హైదరాబాద్ : హైడ్రా హైదరాబాద్ నగరంలో అక్రమార్కులకు ఝలక్ ఇస్తోంది. విలువైన ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్తులను కాపాడింది. మేడ్చల్-మల్కాజిగిరి , హైదరాబాద్ జిల్లాల పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఆక్రమణదారులు 106 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే రంగంలోకి దిగింది. కంటోన్మెంట్ పరిధిలోని GLR (జనరల్ ల్యాండ్ రిజిస్టర్) నంబర్లు 243, 255 , సర్వే నంబర్లు 1, 2 పరిధిలో ఉన్న 106 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి చొరబడి, అక్కడ లేఅవుట్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వారు పర్యావరణానికి హాని కలిగించేలా రంధ్రాలు చేయడం, సహజ సిద్ధమైన కొండలను పేల్చివేయడం, వన్యప్రాణుల ఆవాసాలను దెబ్బ తీయడం వంటి పనులు చేశారు.
అడవిలోని పక్షుల కిలకిల రావాలను నిశ్శబ్దం చేస్తూ, చీమలు కూడా ప్రాణభయంతో నివాస ప్రాంతాలకు పారిపోయేంత తీవ్రతతో వారు కొండలను పేల్చివేశారు. కొండలను పేల్చివేస్తున్న ఈ ఘటనలపై స్థానికులు HYDRA హెల్ప్ లైన్‌కు ఫిర్యాదు చేశారు. ఆక్రమణదారులు ప్రీ-కాస్ట్ ఇటుకలతో కంచెలు కట్టి ఆక్రమణలకు పాల్పడగా… HYDRA వాటిని తొలగించి, ఆ 106 ఎకరాల భూమి చుట్టూ కంచెను ఏర్పాటు చేసింది. దీనితో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. వారు HYDRAకు మద్దతుగా భారీ ర్యాలీలు నిర్వహించారు. బాణసంచా కాల్చి, “HYDRA జిందాబాద్” అని నినదిస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు.
జూలై 18న, రంగారెడ్డి జిల్లా షంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామంలోని సర్వే నంబర్లు 25, 26లో ఉన్న 650 ఎకరాల భూమిని HYDRA పరిరక్షించింది. అలాగే అదే జిల్లాలోని శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో, సర్వే నంబర్ 46లో ఉన్న 84 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ కంచెను ఏర్పాటు చేసింది