newsseals.com
News

ఆదోనికి త్వరలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు

VijayaBhaskar July 30, 2026
newsseals-LokeshNara

క‌ర్నూలు జిల్లా : ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న క‌ర్నూలు జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆదోనిలో జ‌రిగిన తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశం నిర్వ‌హించారు. నియోజకవర్గ ఇన్చార్జి మీనాక్షి నాయుడు చాలా కోరికలు కోరారని తెలిపారు మంత్రి. నా శాఖకు సంబంధించిన మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు, ఐటిఐ మంజూరుకు కృషి చేస్తానని ప్ర‌క‌టించారు. ఉర్దూ జూనియర్ కళాశాలను కోరారన్నారు. రాబోయే డిఎస్సీలో ఉర్దూ టీచర్ రిక్రూట్ మెంట్ చేస్తున్నాం అని వెల్ల‌డించారు నారా లోకేష్‌. త్వరలో ప్రారంభించే బాధ్యత తీసుకుంటాం అన్నారు.

ఆదోనికి పరిశ్రమలు తెచ్చే బాధ్యత తీసుకుంటాం అన్నారు. ఇప్పుడు నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను. పనిచేసే వారిని ప్రోత్సహిస్తా. పని చేయనివారిని దండం పెట్టి మార్చేస్తా. మొహమాటం బాబుది, నాది కాదు అని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. మనసులో ఉన్నది చెబుతాన‌ని అన్నారు. అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షంలో ఉన్నట్లే పనిచేయాలని స్ప‌ష్టం చేశారు మంత్రి. కలసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేసుకుందామని లోకేష్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భారీ పరిశ్రమల మంత్రి టిజి భరత్, నియోజకవర్గ ఇన్చార్జి మీనాక్షి నాయుడు, కర్నూలు పార్లమెంటు అధ్యక్షురాలు గుడిసె కిష్టమ్మ, నియోజకవర్గ పరిశీలకులు కేశవరెడ్డి పాల్గొన్నారు.