newsseals.com
News

స‌న‌త్ న‌గ‌ర్ టిమ్స్ కు మ‌ర్రి చెన్నారెడ్డి పేరు

VijayaBhaskar July 31, 2026
newsseals-MarriChennaReddy

హైద‌రాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ స‌ర్కార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. స‌న‌త్ న‌గ‌ర్ లో ఏర్పాటు చేసిన టిమ్స్ కు మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త మ‌ర్రి చెన్నారెడ్డి పేరుగా మారుస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. . అనుభవజ్ఞులైన నాయకుడు మర్రి చెన్నారెడ్డికి నివాళిగా, సనత్‌నగర్‌లోని ‘తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (TIMS) ఇకపై ‘డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సనత్‌నగర్’గా పిలువబడుతుందని పేర్కొంది. ఉత్త‌ర్వులలో స్ప‌ష్టం చేసింది అధికారికంగా.

ప్రజా జీవితంలో ఆ సీనియర్ నాయకుడు అందించిన విశేష సేవలకు , ఈ ప్రాంత రాజకీయ ముఖచిత్రాన్ని తీర్చిదిద్దడంలో ఆయన పోషించిన పాత్రకు ఇది ఒక నివాళిగా పరిగణించ బడుతోంది అని పేర్కొంది తెలంగాణ ప్ర‌భుత్వం. డాక్టర్ చెన్నారెడ్డి తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమంత్రిగా , అనేక కీలక పదవులలో సేవలందించారు. పాల‌నా ప‌రంగా త‌న‌దైన ముద్ర వేశారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం స‌మ‌యంలో సీఎంగా ఉన్నారు. ప‌లు కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని ప‌వ‌ర్ లోకి తీసుకు రావ‌డంలో తాను కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అత్యంత స‌క్సెస్ ఫుల్ సీఎంగా కూడా చెన్నారెడ్డి గుర్తింపు పొందారు.