మెటా ఇండియా ఎఫెక్ట్ ..డీజీపీ ఆఫీస్ కు డీసీపీ అటాచ్
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా కలకలం రేపింది మెటా ఇండియా హెడ్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడం. మెటా ఇండియా అధిపతిపై నమోదైన కేసులో నగర సైబర్ క్రైమ్ డీసీపీ కోసం గాలింపు ప్రారంభం అయ్యింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ధర్మేంద్ర ప్రధాన్లను కించ పరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ తెలంగాణ బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేయడం కలకలం రేపింది. ఈ కేసులో మెటా అధిపతిని కూడా నిందితుడిగా చేర్చారు పోలీసులు.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో కొందరు పెట్టిన పోస్టులకు మెటా ఎలా బాధ్యత వహిస్తుందనే విషయంపై దేశ వ్యాప్తంగా వివాదం చెలరేగింది. సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబుపై ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. ఈ మేరకు అరవింద్ బాబును డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రావడంతో, అరవింద్ బాబు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు.