newsseals.com
DEVOTIONAL

సెప్టెంబర్ 15 నుండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

VijayaBhaskar August 1, 2026
newsseals-TTD

తిరుమల : శ్రీ‌వారి భక్తుల‌కు టీటీడీ తీపి క‌బురు చెప్పింది. శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌ను ప్ర‌క‌టించింది. తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో పరవశింప చేయనున్నాయని తెలిపింది. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుండి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయ‌ని పేర్కొంది టీటీడీ. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహన సేవలు ఉంటాయి.

సెప్టెంబ‌ర్ 15న సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం. 16న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం. 17న ఉదయం 8 గంటలకు సింహ వాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం, 18న ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం, 19న ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం, 20న ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం. 21న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం , 22న ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం, 23న ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం నిర్వ‌హిస్తామ‌ని తెలిపింది టీటీడీ.