హైడ్రా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కాలేజీలు
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో దర్జాగా కాలేజీలు నిర్వహిస్తున్న యాజమాన్యాలు ఏకంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన బాగోతం బట్టబయలైంది. ఈ ఘటన కలకలం రేపింది ఫైర్ ఎన్వోసీపై రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి ఇంటర్ బోర్డుకు సబ్మిట్ చేసిన ఎనిమిది ప్రైవేట్ కాలేజీలుజ. ఈ సందర్బంగా పరిశీలించిన అధికారులు విస్తు పోయారు. ఇది పూర్తిగా హైడ్రా కమిషనర్ సంతకం కాదని గుర్తించారు. ఆ ఎనిమిది కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేశారు హైడ్రా అడిషనల్ డైరెక్టర్ పాపయ్య.
తప్పుడు సంతకాలతో ఫైర్ ఎన్ఓసీ సమర్పించిన కాలేజీల వివరాలు ఇక్కడ ఉన్నాయి. వాటిలో హైదరాబాద్ లోని హైందవీ జూనియర్ కాలేజీ (బర్కత్పుర), రెసోనెన్స్ జూనియర్ కాలేజీ (SR నగర్), ప్రియాంక జూనియర్ కాలేజీ (మెహిదీపట్నం), మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజీ (విద్యానగర్), శ్రీచైతన్య జూనియర్ కాలేజీ (చంద్రాయణగుట్ట), న్యూ ఎరా జూనియర్ కాలేజీ (చిక్కడపల్లి), షాహీన్ జూనియర్ కాలేజీ (శివరాంపల్లి), వశిష్ట జూనియర్ కాలేజీ (తెల్లాపూర్)లపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా మరో 60 కాలేజీల ఎన్వోసీలను స్క్రూటినీ చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.