రాబోయే రోజుల్లో ఏపీలో వైఎస్సార్సీపీదే అధికారం

తాడేపల్లి గూడెం : ఏపీలో రాబోయే కాలంలో మనమే అధికారంలోకి వస్తామని జోష్యం చెప్పారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ బాస్ జగన్ రెడ్డి. రేపల్లె నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు వైయస్సార్‌సీపీలో చేరారరు. ఈయన ఎవరో కాదు ప్రస్తుతం ఏపీలో రెవిన్యూ శాఖ మంత్రిగా ఉన్న అనగాని సత్య ప్రసాద్ కు స్వయాన సోదరుడు కావడం విశేషం. ఇదిలా ఉండగా తాడేపల్లి గూడెంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్సార్‌సీపీలో చేరారు కాపు నాయకుడు. వందలాది మంది అభిమానులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు.
శ్రీనివాసరావుకు స్వయంగా కండువా కప్పి వైయస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు .ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ జీఎస్ (గూడపాటి శ్రీనివాసరావు) అన్నతో పాటు, ఎవరైతే ఆయన సహచరులంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జాయిన్ అవుతున్నారో.. మీ అందరినీ కూడా సాదరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాను. అదే విధంగా జీఎస్ అన్నను కూడా గుండెల్లో పెట్టుకుంటాను. ఆయన కూడా అన్ని రకాలుగా మంచి చేస్తాడని కచ్చితంగా చెప్పగలనని పేర్కొన్నారు. మీరందరూ రావడం సంతోషం. నియోజకవర్గంలో మోహన్‌ను తమ్ముడిగానే భావించి, రాబోయే ఎన్నికల్లో గెలిపించే దిశగా మీరంతా కూడా అడుగులు వేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జీఎస్ అన్న రాకతో, రేపల్లెలో.. మరీ ముఖ్యంగా పట్టణంలో పార్టీ మరింతగా బలపడుతుందని పేర్కొన్నారు.
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని వెంకట్రామయ్య (నాని), మేరుగు నాగార్జున, ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, రేపల్లె నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ పీటా నాగ మోహనకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు, పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.