newsseals.com
News

మాజీ సైనికుల‌కు సీఎం చంద్ర‌బాబు భ‌రోసా

Posted by: VijayaBhaskar August 11, 2026
newsseals--CM

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండిలో జరిగిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రైతులు, మాజీ సైనికులను కలిశారు. తమ భూములు ’22A’ జాబితాలో చేర్చబడటం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన ‘డీ-నోటిఫికేషన్’ (జాబితా నుండి తొలగించే) అధికారాలను ఆర్.డి.ఓ (RDO)కు బదిలీ చేయాలని ఆయన వెంటనే జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

దీనివల్ల ఉనికిలి, కలిదిండి, వైవాక గ్రామాలకు చెందిన 830 కుటుంబాలకు చెందిన 2,745 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి తక్షణ చర్యలు చేపట్టారు. వారికి ‘1B అడంగల్’ ప్రతులను అందజేశారు. ఈ సందర్భంగా రైతులు ముఖ్యమంత్రికి తమ కృతజ్ఞతలు తెలియ జేశారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తోంద‌న్నారు. గ‌తంలో కొలువు తీరిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హ‌యాంలో ఏపీని అన్ని రంగాల‌లో స‌ర్వ నాశ‌నం అయ్యేలా చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీఎం . ప్ర‌జ‌లు అందుకే త‌న పార్టీని 11 సీట్ల‌కే ప‌రిమితం చేశార‌ని, ఆ విష‌యం తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు.