సుర‌క్షిత‌మైన ఆహారాన్ని ఎంచుకునే హ‌క్కు ఉండాలి

మ‌హారాష్ట్ర : మ‌హారాష్ట్ర‌లో ఇప్పుడు ఎవరి నోట విన్నా ఒకే ఒక్క‌డి పేరు వినిపిస్తోంది. అత‌ను ఎవ‌ర‌ని అనుకుంటున్నారా అక్ర‌మార్కుల గుండెల్లో రైళ్లు ప‌రుగులు పెట్టిస్తూ , ఎప్పుడు ఎక్క‌డ దాడి చేస్తాడో ఎవ‌రికీ తెలియ‌నంత‌గా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతున్న , సంచ‌ల‌నం రేపుతున్న తాను ఓ సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్. అత‌ని పేరు తుకారాం ముండే. ఈ దేశానికి స్వేచ్ఛ ల‌భించి 80 ఏళ్లు అవుతున్న సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు, 143 కోట్ల ప్ర‌జ‌ల‌కు కూడా కీల‌క సూచ‌న‌లు చేశారు.

దేశం నిరంతరం పురోగమించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ప్రస్తుతం నేను ఆహార భద్రతా కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. మన స్వాతంత్రం మనం తీసుకునే ఆహారానికి కూడా వర్తించాలని నేను చెప్పదలుచుకున్నాను. కేవలం రుచి కోసం కాకుండా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటూ ఆరోగ్యానికి మేలు చేసే సురక్షితమైన ఆహారాన్ని ఎంచుకునే స్వేచ్ఛ మనకు ఉండాలని కుండ బ‌ద్ద‌లు కొట్టారు తుకారం ముండే. మనం ఈ విధానాన్ని పాటిస్తే ఆరోగ్యంగా ఉంటామన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటే దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుందని, తద్వారా మనం పురోగతి సాధించేందుకు వీలు క‌లుగుతుంద‌న్నారు. తాజాగా తుకారం ముండే చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *