జగన్ హయాంలో బీసీల హత్యలు : మంత్రి అనగాని

విజ‌య‌వాడ : బీసీల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసం గౌతు లచ్చన్న ఎన్నో ఉద్యమాలు చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రైతుల కోసం మొట్ట మొదటిసారి పాదయాత్ర చేసిన ఘనత కూడా ఆయనదేనన్నారు. శ్రీకాకుళం నుంచి చైన్నై వరకూ 1600ల కిలో మీటర్ల పాదయాత్ర చేశారన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో లచ్చన్న పోరాటం ఆనాటి ఆంగ్లేయులకు కంటి మీద కునుకు లేకుండా చేసిందన్నారు. చివరికి ఆయనను కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు ఇచ్చిందన్నారు. దేశానికి స్వాతంత్ర్య వచ్చిన తరవాత బీసీలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారన్నారు. జగన్ హయాంలో ఎందరో బీసీలు హత్యలకు గురయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు.

సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, బీసీలను అక్కున చేర్చుకున్నారని చెప్పారు అనగాని స‌త్య ప్ర‌సాద్ . బీసీలు విద్యతోనే ఉన్నత స్థానాలకు చేరుకోగలరని సీఎం చంద్రబాబు నమ్మార‌ని, అందుకనే, బీసీల విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. గ‌త జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ హ‌యాంలో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశార‌ని, వాటిని తిరిగి గాడిలో పెట్టేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ ఎక్క‌డా సంక్షేమ ప‌థ‌కాల‌ను ఆప‌లేద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *