చెన్నై : సీఎం దళపతి విజయ్ , పూజా హెగ్డే కీ రోల్ పోషించిన జన నాయగన్ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ వసూళ్లను సాధించింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఇప్పటి దాకా విజయ్ సినిమాను చూడలేని అభిమానులకు తీపి కబురు వచ్చింది. జన నాయగన్ ఆగస్టు 21న ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ మీడియా సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తెలియ చేసింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ సంతోషానికి లోనవుతున్నారు. బలమైన కంటెంట్ తో ఈ మూవీ ముందుకు వచ్చింది. విజయ్ తన సినీ కెరీర్ లో ఇదే ఆఖరి సినిమా అని ప్రకటించాడు.
ఇదిలా ఉండగా ‘జన నాయగన్’ చిత్రం డిజిటల్ విడుదల కోసం ఎదురు చూపులు ఎట్టకేలకు ముగిశాయి. హెచ్. వినోత్ రచన మరియు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగు పెట్టడానికి ముందు విజయ్ నటించిన చివరి సినిమాగా నిలిచింది. ‘జన నాయగన్’ జూలై 23, 2026న థియేటర్లలో విడుదలైంది. ఇది భారతదేశంలో రూ. 227.14 కోట్ల గ్రాస్ , ప్రపంచ వ్యాప్తంగా రూ. 320.34 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. భగవంత్ కేసరి చిత్రం మహిళా సాధికారత చుట్టూ తిరుగుతూ, యువతులు భయాన్ని అధిగమించి తమ కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించింది. కానీ ‘జన నాయగన్’ రాజకీయ ప్రత్యర్థులు, ఉగ్రవాదం , కమర్షియల్ యాక్షన్ అంశాలపై దృష్టి సారిస్తుంది. అలా చేయడం వల్ల, ఇది అసలు కథలోని ఆత్మను కోల్పోయింది, ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.







