newsseals.com
DEVOTIONAL

శార‌దా పీఠం ఆధ్వ‌ర్యంలో సేవలకు గుర్తింపు

Posted by: VijayaBhaskar August 19, 2026
newsseals-Goverr

హైద‌రాబాద్ : విశాఖ శారదా పీఠం వారి ఆధ్వర్యంలో దివ్య కార్యక్రమం” స్త్రీ శక్తి సనాతన శక్తి” అనే దివ్యమైన చర్చ కార్యక్రమం పూజ్య శారదాపీఠ స్వామీజీల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శుక్లా హాజ‌ర‌య్యారు. విశాఖ శారదా పీఠాధిప‌తి శ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామీజీ , శ్రీ శ్రీ స్వాత్మ నందేంద్ర మహాస్వామిజీ వారి ఆధ్వర్యంలో స్త్రీశక్తి సనాతన శక్తి కార్యక్రమం లింగంపల్లి చందానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఘనంగా జరిగింది.

ఈ దివ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల . కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. స్త్రీ శక్తిని జాగృతం చేసే సనాతన శక్తిని గౌరవించే విధంగా ప్రముఖ స్త్రీ మూర్తులు ప్రసంగించిన ఈ కార్యక్రమంలో చేవెళ్ల ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయురాలు, దుర్గావాహిని తెలంగాణ ప్రాంత కన్వీనర్ వాణి సక్కుబాయి కి గవర్నర్ చేతుల మీదుగా ప్రశంస ప‌త్రం, సన్మానం నిర్వహించడం జరిగింది. మహిళల లో సాధికారత, విద్యాభ్యాసం, సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తున్నందుకు సన్మానించారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ శుక్లా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శార‌దా పీఠం ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను అభినందించారు.