డేటా సెంటర్ల ఏర్పాటుతో భారీగా ఉద్యోగాలు

అమరావతి : డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు రావనే చర్చకు తెర దించే ప్రయత్నం చేశారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు వస్తాయా అనే చర్చ జరుగుతోందన్నారు. డేటా సెంటర్ చుట్టూ ఎకో సిస్టమ్ చాలా ముఖ్యం అన్నారు. ఎఐ డేటా సెంటర్స్ వస్తున్నాయి. అడ్వాన్స్ డ్స్ చిప్స్ రావాలి. ఆ చిప్స్ ను ఈరోజు గూగుల్ తీసుకు వస్తుందని వెల్లడించారు. దానివల్ల ఎఐకి సంబంధించిన కటింగ్ ఎడ్జ్, ఇతర కంపెనీలు విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుంటాయని చెప్పారు లోకేష్. భారీ ఎత్తున వస్తున్న డేటా సెంటర్ ఎకోసిస్టమ్ కు ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అవసరం అవుతుందన్నారు. ప్రతి ఐదేళ్లకు దానిని అప్ గ్రేడ్ చేయాల్సి ఉంటుందన్నారు. దానివల్ల ఈరోజు కెరీర్, ఎల్జీ ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని పేర్కొన్నారు.
మరో కంపెనీ కూడా ఈరోజు ఏపీకి వస్తోందని చెప్పారు లోకేష్. రైజింగ్ రాయలసీమలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తున్నందున అక్కడ కేవలం కూలింగ్ ఎకోసిస్టమ్ వల్ల 20 వేలమందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించ బోతున్నాం అని ప్రకటించారు మంత్రి. పవర్ జనరేషన్, ట్రాన్స్ మిషన్ లైన్లు… 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు సరిపడా వరల్డ్ క్లాస్ డేటా సెంటర్లు తీసుకు రావాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అందులో భాగంగా మరికొన్ని కంపెనీలు విశాఖలో భూములు అడుగుతున్నారని తెలిపారు. వరల్డ్ క్లాస్ ట్రాన్స్ ఫార్మర్ల తయారీ, డెలివరీ కోసం ఇన్ ఫ్రా కావాలని కోరుతున్నారని చెప్పారు లోకేస్. అది కూడా విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తాం. పవర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు కూడా ఈరోజు రాయలసీమకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు.