కేపీఎస్సీ ఛైర్మన్‌పై చర్యలకు కర్ణాటక కేబినెట్ సిఫార్సు

బెంగళూరు : కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్సీ) ఛైర్మన్ శివశంకరప్ప సహుకర్‌పై శిక్షాత్మక చర్యలు తీసుకోవాలని, ఆయనను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేస్తూ కర్ణాటక కేబినెట్ తీర్మానించింది. సహుకర్‌కు సంబంధించిన ఆయన నివాసం, కార్యాలయంతో సహా పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం వెలువడింది. తన కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించడానికి నకిలీ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించారన్న ఆరోపణలపై గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆదేశాల మేరకు సహుకర్‌ను గతంలో సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కర్ణాటక హైకోర్టు ఈ సస్పెన్షన్‌పై స్టే విధించి, ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. మరో కీలక నిర్ణయంలో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాష్ట్ర జైలు వ్యవస్థను బలోపేతం చేయడానికి అధునాతన పరికరాల సేకరణ ,సంస్థాపనకు ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించిందని హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపార
లైంగిక దాడి కేసులో దోషిగా తేలిన మాజీ ఎంపీ ప్రజ్జ్వల్ రేవన్న జైలు గది నుంచి ఇటీవల ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఈ ప్రతిపాదనలో ఏఐ ఆధారిత నిఘా కెమెరాలు, పోర్టబుల్ సిగ్నల్ జామ్మర్లు, కేంద్రీకృత ఖైదీల కాలింగ్ సిస్టమ్ వంటి ఇతర సాధనాల సంస్థాపన కూడా ఉంది. సత్ప్రవర్తన ప్రాతిపదికన 28 మంది దోషులను విడుదల చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది.. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) కోసం పలు సంస్కరణలపై చర్చించింది. కర్ణాటక మంత్రివర్గం ‘కర్ణాటక ప్రభుత్వ ప్రాంగణాలు, ప్రజా ఆస్తుల వినియోగ నియంత్రణ బిల్లు-2026’కు ఆమోదం తెలిపినట్లు హోం మంత్రి తెలిపారు.