newsseals.com
News

స‌ర్ ప్ర‌క్రియపై క‌మిష‌న‌ర్ క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న

Posted by: VijayaBhaskar August 25, 2026
newsseals-SIR

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ (జీహెచ్ఎంసీ) కమిషనర్ ఆర్.వి. కర్ణ‌న్ నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని AC గార్డ్స్, CIB క్వార్టర్స్ (పోలింగ్ స్టేషన్ నం. 1) వద్ద జరుగుతున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) నోటీసుల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.. ఈ క్షేత్రస్థాయి కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. కమిషనర్ ఎన్నికల క్షేత్రస్థాయి బృందాలతో మాట్లాడారు. SIR నోటీసుల పంపిణీ క్రమబద్ధంగా జరగాలని, ఓటర్లకు సమాచారం స్పష్టంగా అందాలని, ప్రక్రియ అంతటా వారికి సకాలంలో సహాయం అందించాలని అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు.

అలాగే, ఆయన స్థానిక నివాసితులతో మాట్లాడి SIR ప్రక్రియ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. నోటీసులోని వివరాలను జాగ్రత్తగా సరి చూసుకోవాలని మరియు నిర్ణీత గడువులోగా అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని ఓటర్లకు సూచించారు క‌మిష‌న‌ర్. ఫారమ్‌లు, పత్రాలు , సమర్పణ ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సహాయం కోసం తమ సంబంధిత బూత్ స్థాయి అధికారులను (BLOs) సంప్రదించాలని పౌరులను కోరారు. SIR ప్రక్రియ సజావుగా , పారదర్శకంగా సాగేందుకు సరైన సమన్వయం, పౌరుల ప్రశ్నలకు తక్షణ స్పందన , అర్హులైన ఓటర్లకు సమర్థవంతమైన సహకారం అందించడం అత్యవసరమని కమిషనర్ నొక్కి చెప్పారు.