newsseals.com

హైదరాబాద్‌లో రితేష్ దేశ్‌ముఖ్ హ‌ల్ చ‌ల్

August 28, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : బాలీవుడ్ ప్రముఖ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమవ్వడం ఇప్పుడు టాలీవుడ్‌లో సరికొత్త సంచలనంగా మారింది. ఆయన ఎయిర్‌పోర్టులో కెమెరాల కంటికి చిక్కిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన రితేష్, ఇప్పుడు సడన్‌గా హైదరాబాద్‌లో ల్యాండ్ అవ్వడంతో ఆయన ఒక భారీ తెలుగు ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RAPO23’లో రితేష్ దేశ్‌ముఖ్ పవర్‌ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.

ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో హీరో పాత్రకు దీటుగా నిలిచే ఒక బలమైన విలన్ క్యారెక్టర్ కోసం చిత్ర బృందం మొదట ఫహద్ ఫాజిల్, ఎస్‌జే సూర్య వంటి స్టార్లను అనుకున్నప్పటికీ, ఫైనల్‌గా రితేష్ దేశ్‌ముఖ్‌ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ యాక్షన్ డ్రామా షూటింగ్‌లో పాల్గొనడానికే రితేష్ హైదరాబాద్‌కు వచ్చినట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు మరో ఆసక్తికరమైన కనెక్షన్ కూడా ఉంది. రామ్ పోతినేని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘రెడీ’ సినిమాలో కథానాయికగా నటించిన జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ సతీమణి అన్న సంగతి తెలిసిందే. ఆ సమయం నుంచే రామ్‌కు, రితేష్ కుటుంబానికి మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఇప్పుడు ఆ స్నేహంతోనే రితేష్ దేశ్‌ముఖ్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై రామ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ వండర్ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ తోడవ్వడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి

Related News