అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన 20 గంటలకు పైగా రాష్ట్రం అభివృద్ది, సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ, సమీక్షిస్తూ పాలనా పరంగా తనదైన ముద్ర కనబరుస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ‘నియోజకవర్గ విజన్ కార్యాచరణ ప్రణాళిక’ (Constituency Vision Action Plan)ను అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలన, ప్రజా సమస్యల సత్వర పరిష్కారం, సుపరిపాలన లక్ష్యాలతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘గోల్డెన్ నియోజకవర్గ విజన్ కార్యాచరణ ప్రణాళిక’ అమలు తీరును ఆయన ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, యువ నిపుణులు , నాలెడ్జ్ పార్టనర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు , అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలను భాగస్వాములను చేసినప్పుడే అద్భుతమైన ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి ఈసందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికే తాము తీసుకుంటున్న నిర్ఱయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. ఆయా జిల్లాలలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై కూడా ఆయన ఆరా తీశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పయ్యవుల కేశవ్, ఆర్థిక , ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఏపీఎస్ డీపీఎస్ ఈడీ శ్రీ వి.ఆర్. అలపర్తితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు.





