చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలనంగా మారారు. ఆయన కేవలం 2 ఏళ్ల కాలంలోనే రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించారు. అనాది కాలంగా రాజకీయ పరంగా తమదైన ముద్ర వేసిన , ఘనమైన చరిత్ర కలిగిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. టీవీకే పార్టీని ఏర్పాటు చేసి భారీ ఎత్తున సీట్లను కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్, వీసీకే, వామపక్షాల మద్దతుతో కూటమి సర్కార్ ను ఏర్పాటు చేశారు. దేశంలోని ఆయా రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం విజయ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఆశ్చర్య పోయేలా చేస్తున్నారు. తన పాలనను పూర్తిగా ప్రజలకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నారు .అవినీతి రహిత పాలనకు పెద్దపీట వేశారు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రత్యేకించి ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
అవినీతికి ఎవరు పాల్పడినా తనకు నేరుగా ఫిర్యాదు చేయాలని, వారికి ఏకంగా రూ. లక్ష బహుమానంగా ఇస్తానని ప్రకటించారు. విద్యా రంగానికి భారీ ఎత్తున నిధులను బడ్జెట్ లో కేటాయించారు. నిజాయితీ కలిగిన ఐఏఎస్ లు, ఐపీఎస్ లకు కీలకమైన పదవులు కట్టబెట్టారు. తాజాగా సీఎం విజయ్ పోలీస్ స్ట్టేషన్ ను సందర్శించి విస్తు పోయేలా చేశారు. చెన్నైలోని పుజల్ సెంట్రల్ జైలు , పుజల్ పోలీస్ స్టేషన్ను స్వయంగా సందర్శించి, తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో ముఖ్యమంత్రి స్వయంగా ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోగా, పోలీస్ ఇన్స్పెక్టర్ మాత్రం తన సొంత కుర్చీలో కూర్చునేలా అనుమతించడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. బహుశా భారతదేశంలోనే ఇలా జరగడం ఇదే మొదటిసారి కావచ్చు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఒక అధికారి పదవిని , గౌరవాన్ని మన్నించిన తీరు నిజంగా అభినందనీయం. దళపతి..విజయ్ రియల్లీ హ్యాట్సాఫ్ యు..!





