newsseals.com
DEVOTIONAL

టీటీడీ సాధికారిక మండలి సభ్యుడిగా విన‌య్ చంద్

Posted by: VijayaBhaskar November 12, 2026
newsseals-TTDMemer

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) సాధికారిక మండలి సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ కార్య‌ద‌ర్శి వి.వినయ్ చంద్ ప్రమాణస్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద జరిగిన కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం ముందు మీడియాతో వి.వినయ్ చంద్ మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో టీటీడీ సాధికారిక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు.

తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలిపారు ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి. టీటీడీ సాధికారిక మండలి సభ్యుడిగా ఉన్నంత వరకు సాధికారిక మండలి చైర్మన్ ముద్దాడ రవిచంద్ర, మరో సభ్యులు కె.కన్నబాబులతో సమన్వయంతో పని చేసి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్వో మురళీకృష్ణ, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.