newsseals.com
News

విద్యార్థుల కోసం గ్రంథాల‌యం ప్రారంభం

Posted by: VijayaBhaskar November 14, 2026
newsseals-Vijay

చెన్నై : విద్యార్థుల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉండేలా గ్రంథాల‌యాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. చెన్నైలోని పెరంబూర్ ఎమ్మెల్యే కార్యాలయ ప్రాంగణంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ‘వెట్రి లైబ్రరీ’ని (Vettri Library) ప్రారంభించారు. అదేవిధంగా ఈ-సేవై కేంద్రం (e-Sevai Centre) ద్వారా కుల ధృవీకరణ పత్రాలు , ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వాటిని అందజేశారు. అలాగే ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు.

ఈ సంద‌ర్బంగా సీఎం మాట్లాడారు. ప్ర‌భుత్వం విద్యార్థులు, నిరుద్యోగులు చ‌దువుకునేందుకు వీలుగా అనేక కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్న‌ట్లు తెలిపారు. తాము ప‌వ‌ర్ లోకి రాగానే విద్యార్థుల సంక్షేమం కోసం చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు సీఎం. ఇందులో భాగంగా మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా కొత్త కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. ఇందులో భాగంగానే లైబ్ర‌రీల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. దీని వ‌ల్ల స‌మ‌యం వృధా కాకుండా చ‌దువుకునేందుకు వీలు క‌లుగుతుంద‌న్నారు. ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్ అనేది అత్య‌వ‌స‌రంగా మారింద‌న్నారు సీఎం. దీనిని గుర్తించి కార్యాల‌యంలోనే వైఫై సౌక‌ర్యం కల్పించామ‌న్నారు.