newsseals.com
ENTERTAINMENT

రేఖ‌ను వెంటాడుతూనే ఉన్న వివాదం

Posted by: VijayaBhaskar November 16, 2026
newsseals-Rekha

ముంబై : హిందీ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టి రేఖ‌. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. త‌ను ఎవ‌రో కాదు ప్ర‌ముఖ , దిగ్గ‌జ న‌టుడు చెన్నైకి చెందిన శివాజీ గ‌ణేష‌న్ ముద్దుల కూతురు. వ‌య‌సు మీద ప‌డుతున్నా ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ త‌ర‌గ‌ని అందం రేఖ స్వంతం. తాజాగా త‌ను పెళ్లి చేసుకున్న భ‌ర్త గురించిన ఫోటోలు ఇప్పుడు తిరిగి ప్ర‌త్యక్షం అయ్యాయి. చర్చ‌కు దారితీసేలా చేశాయి. సినిమాల‌లో న‌టిస్తుండ‌గానే రేఖ ఢిల్లీకి చెందిన ఓ వ్యాపార‌వేత్త‌ను పెళ్లి చేసుకుంది. పరిచయం అయిన కొద్ది నెలలకే ఇది జ‌రిగింది. ఏడు నెలల్లోపే రేఖ వితంతువుగా మారి పోయింది. బాలీవుడ్‌లోని అత్యంత వివాదాస్పద వ్యక్తులలో ఒకరిగా నిలిచింది.

1990లో, రేఖ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్‌ను వివాహం చేసుకుంది. కానీ వారి వివాహం త్వరలోనే ఇబ్బందుల్లో పడింది. అక్టోబర్ 2న, ముఖేష్ తన ఢిల్లీ నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతను రాసిన సూసైడ్ నోట్‌లో రేఖను ప్రస్తావించాడు. ఆమె ఆర్థికంగా స్వతంత్రురాలు కాబట్టి తన ఆస్తిలో ఎలాంటి వాటా ఇవ్వడం లేదని పేర్కొన్నట్లు నివేదికలు తెలిపాయి. అతని మరణం మీడియాలో అసాధారణమైన దుమారాన్ని రేపింది. రేఖ తీవ్రమైన ప్రజా విమర్శలను ఎదుర్కొంది, అతని మరణానికి రేఖ‌నే కారణమని పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. పత్రికలు, సినీ పరిశ్రమలోని కొన్ని వర్గాలచే ‘మంత్రగత్తె’, ‘వ్యాంప్’ అని ముద్ర వేయబడింది. అయితే ముఖేష్ అగ‌ర్వాల్ సోదరుడు ఆమెను సమర్థించాడు. రేఖ తమ కుటుంబం నుండి ఎప్పుడూ ఏమీ అడగలేదని చెప్పాడు. కొన్ని నెలలు మాత్రమే నిలిచిన వివాహం రేఖను సంవత్సరాల తరబడి వెంటాడిన వివాదంగా మారింది. బాలీవుడ్ గ్లామర్ వెనుక ఆమె వ్యక్తిగత జీవితంలో అత్యంత బాధాకరమైన అధ్యాయం ఉంది.