newsseals.com
News

కుల గ‌ణ‌న ప్ర‌క్రియకు వైసీపీ సంపూర్ణ మ‌ద్ద‌తు

Posted by: VijayaBhaskar November 20, 2026
newsseals-SJagan

తాడేప‌ల్లి గూడెం : అఖిల భారత కులగణన సమన్వయ కమిటీ (ఏఐసీసీసీసీ) ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు వైసీపీ బాస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రాబోయే 2027 జనగణనకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సుస్థిర, సమానమైన అభివృద్ధి సాధించాలంటే సామాజిక న్యాయానికి కచ్చితమైన గణాంకాలు ప్రాతిపదికగా ఉండాలన్నారు. ఈ నేపథ్యంలో కులగణనకు సంబంధించి వారు చేస్తున్న డిమాండ్లు సహేతుకమైనవి అని పేర్కొన్నారు. వాటిని కచ్చితంగా తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు జ‌గ‌న్ రెడ్డి. 2027 జనగణనలో ఓబీసీ/బీసీలకు (ఆయా రాష్ట్రాల్లోని వర్గీకరణ ప్రకారం) తప్పనిసరిగా కులాన్ని నమోదు చేసే కాలమ్‌ను చేర్చాలి.

కులగణన ప్రక్రియలో ఏ ఒక్క కులం కూడా మినహాయింపునకు గురి కాకుండా, అన్ని కులాలతో కూడిన సమగ్ర మెనూ అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు .కుటుంబాల ఆర్థిక స్థితిగతులను వెల్లడించే సూచికలను చేర్చాలి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ వీటన్నింటికీ దృఢంగా కట్టుబడి ఉందన్నారు జ‌గ‌న్ రెడ్డి. సమగ్ర కులగణన నిర్వహించాలన్న డిమాండ్‌కు మొదటి నుంచీ గట్టిగా మద్దతునిస్తూ వస్తోందని తెలిపారు . వాస్తవ గణాంకాల ఆధారంగా విధానాల రూపకల్పనకు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కచ్చితమైన, సమగ్రమైన, అన్ని వర్గాలను కలుపుకొని నిర్వహించే కులగణన అత్యంత అవసరం అని పేర్కొన్నారు.