భారతదేశ భవిష్యత్తును నిర్మించిన ఇందిరాగాంధీ

హైదరాబాద్ : భారత దేశం అన్ని రంగాలలో ముందుకు వెళ్లేలా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కీలకమైన పాత్ర పోషించారని కొనియాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఇందిరా గాంధీ జీవితానికి సంబంధించిన సందేశాన్ని ఇందిరమ్మ పలుకులు అనే పేరుతో పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆలోచనలు, ఆశయాలు, ప్రజాసేవా దృక్పథం ,దేశం పట్ల ఆమెకున్న అంకితభావాన్ని నేటి యువతకు, భావి తరాలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని తెలుగులో ప్రచురించారని చెప్పారు సీఎం.
ఈ పుస్తకానికి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ గారు ముందుమాట రాయడం నాకు దక్కిన ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నానని అన్నారు రేవంత్ రెడ్డి. డాక్టర్ పొన్నం రవిచంద్ర, డాక్టర్ మామిడి హరికృష్ణ , శ్రీ లక్ష్మి ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారని చెప్పారు. ఇందిరా గాంధీ స్ఫూర్తి దాయకమైన ఆలోచనలు, సందేశాలు అందరికీ చేరాలని, ముఖ్యంగా యువతకు అవి దిశానిర్దేశం చేసే వెలు గుదీపాలుగా నిలవాలని ఆశిస్తున్నానని అన్నారు సీఎం. ఇదిలా ఉండగా భారత దేశంలో ఎల్లప్పటికీ ఇందిరా గాంధీ గుర్తుండి పోతారని అన్నారు. ఆమె హయాంలోనే ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేశారు. ఈ ఘనత తనకే దక్కుతుంది. ఇదే క్రమంలో దేశంలో ఎమర్జెన్సీని కూడా విధించిన అపవాదును కూడా ఆమె మూట గట్టుకున్నారు.