newsseals.com
News

తెలుగుదేశం పార్టీ డిప్యూటీ మేయ‌ర్ల జాబితా విడుద‌ల

Posted by: VijayaBhaskar November 23, 2026
newsseals-TDPAnnounce

అమ‌రావ‌తి : తెలుగుదేశం, జ‌న‌సేన‌ పార్టీలు కీల‌క ప్ర‌క‌ట‌నలు విడుద‌ల చేశాయి. ఈ మేర‌కు త‌మ పార్టీల త‌ర‌పున డిప్యూటీ మేయ‌ర్లకు సంబంధించి అభ్య‌ర్థుల వివ‌రాల‌ను వెల్ల‌డించాయి. ఇదిలా ఉండ‌గా ఇవాళ ఏడు డిప్యూటీ మేయర్ల అభ్యర్థుల పేర్లను సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ఎంపికలో మహిళలకు టీడీపీ పెద్దపీట వేసింది. ఏడు స్థానాల్లో ఐదింటిని మహిళలకు కేటాయించింది. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా టి. స్వాతి, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా ఎ. గోపీనాధ్ ను ఖ‌రారు చేశారు సీఎం.

ఇదిలా ఉండ‌గా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా పృధ్వీ శారద, కడప మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా మన్సూర్ ఆలీఖాన్, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా చావలి చర్పిత, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా చెన్నుపాటి క్రాంతి శ్రీ, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా ప్రసాదుల రజనీలను టీడీపీ ప్రకటించింది. త‌మ పార్టీ కోసం ప‌ని చేసిన వారికి ప్ర‌యారిటీ ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు ఈ సంద‌ర్బంగా నారా చంద్ర‌బాబు నాయుడు. .