మాట నిలబెట్టకున్న సీఎం జోసెఫ్ విజయ్

చెన్నై : తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలనంగా మారారు. పాలనా పరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూనే ప్రభావం చూపిస్తున్నారు. తాజాగా సీఎం సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. సీఎం గతంలో ఇచ్చిన హామీ నెరవేరడంతో ఎంతో ఆనందకరమైన క్షణం చోటు చేసుకుంది. అక్టోబర్ 2న మధురాంతకం నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచార సమయంలో అచ్చరాపాక్కం యూనియన్లోని కీళమూరు గ్రామ పంచాయతీకి చెందిన రుక్మిణి (42) , సెల్వకుమార్ (50) అనే దివ్యాంగులను ముఖ్యమంత్రి కలిశారు. వారి అవసరాల గురించి తెలుసుకున్న ఆయన, వారికి కొత్త వాహనాలను అందజేస్తానని హామీ ఇచ్చారు.
ఆ హామీని నిలబెట్టుకున్నారు ఇవాళ. సీఎం మంగళవారం తన నివాసంలో వారికి బ్యాటరీతో నడిచే మోటరైజ్డ్ వీల్చైర్లను అందజేశారు. వారిలో సంతోషాన్ని నింపారు. వారి దైనందిన ప్రయాణాన్ని సులభతరం చేసి, వారి జీవితాల్లో ఆత్మ విశ్వాసాన్ని, సంతోషాన్ని నింపే ఈ హృదయ పూర్వక కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా సీఎం దళపతి విజయ్ చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో మధురాంతకం ఎమ్మెల్యే మరకతం కుమారవేల్ కూడా పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని వికలైన వారందరికీ వీల్ చైర్స్ అందిస్తామని తెలిపారు విజయ్. మాట ఇవ్వడం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం విజయ్ సిద్దాంతం.