newsseals.com
News

సందీప్ తో రాజ‌గోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి భేటీ

Posted by: VijayaBhaskar November 24, 2026
newsseals-RajagopalReddy

హైద‌రాబాద్ : తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో సంచ‌ల‌నంగా మారారు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, జ‌నంప‌ల్లి అనిరుధ్ రెడ్డి. పార్టీ లైన్ త‌ప్పుతున్నారంటూ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ చైర్మ‌న్ , ఎంపీ మ‌ల్లు ర‌వి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ మేర‌కు వీరితో రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ గా నూత‌నంగా నియ‌మితులైన సందీప్ తో భేటీ అయ్యారు. వీరి స‌మావేశం పార్టీలో క‌ల‌క‌లం రేపింది. అయితే ప్ర‌భుత్వ , పార్టీ ప‌రంగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఇన్‌ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీని, ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించడం సరికాదని సందీప్ స్పష్టం చేశారు. ఇకపై ఎటువంటి బహిరంగ వ్యాఖ్యలు చేయబోమని రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండ‌గా వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ హైక‌మాండ్ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. కొత్త ఇంఛార్జ్ కు బిగ్ టాస్క్ అప్పగించారు. . సీఎం రేవంత్ లక్ష్యంగా చేసిన వ్యాఖ్యల పైన పార్టీ నాయకత్వం సీరి యస్ అయింది. తాజాగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా నియమితులైన సందీప్ ను కలిసి అన్ని అంశాలు చర్చించాలని హైకమాండ్ సూచించింది. దీంతో, ఈ ఇద్దరూ సందీప్ తో భేటీ అయ్యారు. అన్ని విషయాల పైన చర్చించారు. కాగా, ఈ సమావేశం లో పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడానికి అవసరమైన సూచనలను రాజగోపాల్ రెడ్డి ఇన్‌చార్జి సందీప్‌కు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై కూడా ఆయన చర్చించారు. పార్టీలో మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చిన సందీప్, ఓపికతో ఉండాలని రాజగోపాల్ రెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది.