newsseals.com

నటుడు రంగనాథన్‌పై కేసు నమోదు

November 26, 2026 · VijayaBhaskar

చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు అర్జున్ స‌ర్జ కూతురుకు సంబంధించి వ్యక్తిగ‌త ఆరోప‌ణ‌లు చేసిన న‌టుడు రంగ‌నాథ‌న్ పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. సర్జా చిన్న కుమార్తె అంజనకు ఇటీవల వివాహం జరిగింది. ఈ వివాహానికి అర్జున్ పెద్ద కుమార్తె, నటి ఐశ్వర్య అర్జున్ హాజరు కాలేదు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు ఐశ్వర్యపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ వీడియోలు చేశారు. ముఖ్యంగా ఐశ్వర్య వ్యక్తిగత అలవాట్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. నటుడు , యూట్యూబర్ అయిన బైల్వాన్ రంగనాథన్ కూడా తన కుమార్తె గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని అర్జున్ సర్జా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎటువంటి ఆధారాలు లేకుండానే రంగనాథన్ ఇటువంటి ఆరోపణలు చేస్తూ తన కుమార్తె ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని అర్జున్ తన ఫిర్యాదులో తెలిపారు. ఈ నేపథ్యంలో చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన సైబర్ విభాగం రంగనాథన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది . పోలీసులు రంగనాథన్‌కు నోటీసులు జారీ చేసి, విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. దీనిపై ఆయన పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా అక్కడ సుమారు ఏడు గంటలకు పైగా త‌న‌ను విచారించినట్లు సమాచారం. ఈ మొత్తం వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా అర్జున్ స‌ర్జా, త‌న కూతుళ్ల‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త విష‌యాలు ఇప్పుడు బ‌హిరంగంగా చ‌ర్చ‌కు దారితీసేలా చేశాయి.

Related News