newsseals.com

ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించ‌డం చాలా క‌ష్టం

November 26, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : స‌క్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన అనిల్ రావిపూడి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌న సినీ కెరీర్ లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలు తీశాడు. త‌న‌కు లైఫ్ లో ఛాన్స్ ఇచ్చిన నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ గురించి కూడా ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తూ ఉంటాడు. త‌న‌తో తొలిసారిగా ప‌టాస్ సినిమా తీశాడు. అది బిగ్ స‌క్సెస్ అయ్యింది. ఆ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో తీసిని మూవీ సూపర్ స‌క్సెస్. ఆ త‌ర్వాత వ‌రుస‌గా టాప్ హీరోల‌తో సినిమాలు తీశాడు. మ‌హేష్ బాబుతో స‌రిలేరు నీకెవ్వ‌రు, నంద‌మూరి బాల‌కృష్ణ‌తో చేసిన చిత్రం సంచ‌ల‌నంగా మారింది. మెగాస్టార్ చిరంజీవితో తీసిన మ‌న శివ శంక‌ర ప్ర‌సాద్ గారు బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. అంత‌కు ముందు పూర్తిగా కామెడీ టైమింగ్ తో విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ తో క‌లిపి ఎఫ్ 2 తీశాడు. ఇది కాసుల వ‌ర్షం కురిపించింది. దీనికి సీక్వెల్ గా ఎఫ్ 3 తీశాడు. ఇది కూడా బిగ్ హిట్ గా నిలిచింది. ఆ త‌ర్వాత త‌ను తాజాగా విక్ట‌రీ వెంక‌టేష్ , క‌ల్యాణ్ రామ్, కృతి శెట్టి, కీర్తి శెట్టితో క‌లిపి జ‌న‌వ‌రి 12 విడుద‌ల తీస్తున్నాడు.

త‌న‌కు సంక్రాంతి పండుగ సెంటిమెంట్. తాను తీసే ప్ర‌తి సినిమాను ఈ ఫెస్టివ‌ల్ గా రిలీజ్ చేయ‌డం ప‌నిగా పెట్టుకున్నాడు. వ‌చ్చే ఏడాది 2027 సంక్రాంతికి జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేస్తామని ప్ర‌క‌టించాడు. ఇదే క్ర‌మంలో మ‌రో సంచ‌ల‌న అప్ డేట్ కూడా వ‌చ్చింది. జూనియ‌ర్ ఎన్టీఆర్ తో త‌న త‌దుప‌రి చిత్రం ఉంటుంద‌ని తెలిపాడు. ఈ ఇద్ద‌రి కాంబోలో వ‌చ్చే మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.ఈ విష‌యాన్ని నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ధ్రువీక‌రించాడు కూడా. తాజాగా చిరంజీవి మ‌న శివ శంక‌ర ప్ర‌సాద్ గారూ మూవీకి సంబంధించి అనిల్ రావిపూడికి అవార్డు ల‌భించింది. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ సినిమా తీయ‌డం సుల‌భ‌మేన‌ని, కానీ కామెడీ పండించ‌డం చాలా క‌ష్టం అని పేర్కొన్నాడు.

Related News