newsseals.com
News

సీఎం జోసెఫ్ విజ‌య్ కి లీగ‌ల్ నోటీసులు

Posted by: VijayaBhaskar November 26, 2026
newsseals-LegalNotice

తిరుప‌తి : బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, టీటీడీ బోర్డు మాజీ స‌భ్యుడు భాను ప్ర‌కాష్‌రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు టీవీకే పార్టీ చీఫ్‌, త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ కు. త‌మిళ‌నాడు రాష్ట్రంలో తీవ్ర వివాదానికి దారి తీసింది తిరుప్పరంకుండ్రం దీప వివాదం.. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశించినా ఎందుకు అమ‌లు చేయ‌లేద‌నే దానిపై త‌ను సీఎంను నిల‌దీశారు. ఈ సంద‌ర్బంగా లాయ‌ర్ ద్వారా లీగ‌ల్ నోటీసులు పంపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తమిళనాడు ప్రభుత్వం అమలు చేయలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. నవంబర్ 20న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండ‌గా భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్తానం ఆదేశాలు జారీ చేసినా ఎందుకు ప‌క్క‌న ఎట్టారంటూ నిలదీశారు సీఎం విజ‌య్ ని. 24న నిర్ణీత ‘దీపతూన్’ (దీప స్తంభం) వద్ద కార్తీక దీపాన్ని వెలిగించలేదని నోటీసులో పేర్కొన్నారు. దీపాన్ని ఎందుకు వెలిగించలేదో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. లేక పోతే చ‌ట్ట ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌జ‌ల‌కు మెరుగైన పాల‌న అందిస్తామ‌ని ప్ర‌క‌టించిన విజ‌య్ స‌ర్కార్ వ‌రుస ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు, నిర్ణ‌యాల‌తో ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటోంది.