newsseals.com
News

ఆక‌స్మిక త‌నిఖీ చేసిన ప్రియాంక అల‌

Posted by: VijayaBhaskar November 26, 2026
newsseals-PriyyankaAla

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ ప్రియాంక అల ఆక‌స్మిక త‌నిఖీ చేశారు. ఆసిఫ్‌నగర్ మండలం పానిపురలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను స‌డెన్ గా విజిట్ చేశారు. నాణ్యమైన విద్యను అందించడం పైనా, విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగు పరచడంపైనా దృష్టి సారించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కలెక్టర్ ఉపాధ్యాయుల హాజరు, తరగతుల వారీగా విద్యార్థుల సంఖ్య, తరగతి గది సౌకర్యాలను సమీక్షించారు. తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్లతో సహా పాఠశాల ప్రాంగణ మంతటా పరిశుభ్రతను పాటించాలని స్ప‌ష్టం చేశారు. ఏ మాత్రం నిర్ల‌క్ష్యం వ‌హించినా చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ హెచ్చ‌రించారు.

క‌లెక్ట‌ర్ ప్రియాంక అల ప్రీ-ప్రైమరీ విభాగాన్ని కూడా సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలతో మాట్లాడారు. అభ్యసన కార్యకలాపాలను సమీక్షించారు. బాల్యదశ సంరక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
నిర్దేశించిన మెనూ ప్రకారం కచ్చితంగా సమయానికి ఆహారం అందించేలా చూడాలని ఆదేశించారు పాఠ‌శాల ఇంఛార్జ్ ను. పిల్లల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు జిల్లా క‌లెక్ట‌ర్.
పాఠశాలల్లో బోధనా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, పారిశుధ్యాన్ని నిశితంగా పర్యవేక్షించడానికి, క్రమం తప్పకుండా క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.