‘వారణాసి’ చిత్రంలో శ్రీరాముడిగా మహేష్ బాబు

హైదరాబాద్ : అందరి కళ్లు ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న వారణాసి చిత్రం. 2027లో ఈ సినిమా విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు మూవీ మేకర్స్. భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు జక్కన్న. ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. వారణాసి చిత్రంలో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించనున్నట్లు టాక్. ‘రామాయణం’లో శ్రీరాముడిగా రణబీర్ కపూర్ ఇప్పటికే ప్రేక్షకులకు కనిపించి మెప్పించారు. ఇప్పుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ‘వారణాసి’ చిత్రంలో మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో కనిపించ నుండటం భారీ ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ఈ చిత్రంలో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించే ఘట్టం ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా నిలవనుంది. ఆయన ఈ పాత్రలో సినిమాలోని ఒక నిర్దిష్ట భాగంలో మాత్రమే కనిపిస్తారని సమాచారం, అయినప్పటికీ కథా గమనంలో ఈ పాత్ర కీలక పాత్ర పోషించనుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ పాత్రకు సంబంధించి కేవలం మహేష్ బాబు రూపమే కాకుండా రాజమౌళి దీనిని ఎలా మలిచారనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. పురాణ పాత్రను నేటి కాలపు కథాంశంతో రాజమౌళి అనుసంధానించిన తీరు చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని సమాచారం.
ఈ పాత్ర రూపకల్పన, మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ , రాజమౌళి కథా శైలి కలిసి, ఈ భాగాన్ని ప్రేక్షకులకు ఎంతో ఆసక్తికరంగా మార్చనున్నాయి. వారణాసి’ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతుండగా, 2027లో సినిమా విడుదల కాకముందే శ్రీరాముడిగా మహేష్ బాబు కనిపించ బోతున్నారనే విషయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.