newsseals.com
ENTERTAINMENT

సంప‌త్ నంది భోగి మూవీకి మిశ్ర‌మ స్పంద‌న

Posted by: VijayaBhaskar November 27, 2026
newsseals-BhogiMovie

హైద‌రాబాద్ : సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ నటించిన తాజా చిత్రం భోగి. ఈ చిత్రం శుక్ర‌వారం విడుద‌లైంది. ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. 1960ల నాటి తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో అనుపమ పరమేశ్వరన్ , డింపుల్ హయాతి కీలక పాత్రల్లో నటించారు. మూఢ నమ్మకాలు, సామాజిక అన్యాయాలు, ఒక శక్తివంతుడైన గ్రామ నాయకుడికి వ్యతిరేకంగా సాగే పోరాటం ఈ చిత్ర కథాంశం. ఈ కథ తెలంగాణలోని ‘బొగ్గులగుట్ట’ అనే కల్పిత గ్రామంలో జరుగుతుంది. ఆ గ్రామం ఒక శక్తివంతుడైన పటేల్ (శరత్ లోహితాశ్వ) ఆధీనంలో ఉంటుంది. ఆయన తీసుకునే నిర్ణయాలను గ్రామస్తులందరూ పాటిస్తుంటారు. గ్రామానికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆ పటేల్ ప్రత్యేక పూజలు చేసి తమను కాపాడతాడని గ్రామస్తులు నమ్ముతుంటారు.

గంగ (శర్వానంద్) తన ఐదుగురు చెల్లెళ్లతో కలిసి జీవిస్తూ కమ్మరి పని చేస్తుంటాడు. ఒకసారి అడవికి వెళ్ళినప్పుడు, పటేల్ చేస్తున్న పనులకు సంబంధించిన ఒక దిగ్భ్రాంతికరమైన నిజం గంగకు తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాత పటేల్‌తో గంగకు ఉన్న సంబంధం మారిపోతుంది; అతను ఆ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధమవుతాడు. శక్తివంతుడైన పటేల్‌కు వ్యతిరేకంగా గంగ చేసే పోరాటం. ఈ క్రమంలో అతని కుటుంబం ఎదుర్కొనే సవాళ్లే ఈ చిత్ర కథాంశం. ఇందులో అనుపమ పరమేశ్వరన్ ‘సులోచన’ పాత్రలో డింపుల్ హయాతి ‘మందారం’ పాత్రలో నటించారు.

‘భోగి’ చిత్రం గ్రామీణ వాతావరణం, పటేల్ ప్రభావం, గంగ కుటుంబ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ ఆసక్తికరంగా మొదలవుతుంది. మొదటి 30 నిమిషాలు కథపై కొంత కుతూహలాన్ని కలిగిస్తాయి. అయితే, పటేల్ చేస్తున్న పనుల వెనుక ఉన్న అసలు నిజం హీరోకి తెలిసిన తర్వాత, కథనం ఊహించ దగినదిగా మారిపోతుంది. ఈ చిత్రం మూఢనమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల్లోని సామాజిక సమస్యల వంటి గంభీరమైన అంశాలను స్పృశిస్తుంది. కానీ, దర్శకుడు భావోద్వేగపూరిత కథాంశం కంటే హింసాత్మక సన్నివేశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కొన్ని యాక్షన్ సన్నివేశాలను అనవసరంగా సాగదీయడం వల్ల, ద్వితీయార్థం చాలా సుదీర్ఘంగా అనిపించి, ప్రేక్షకులకు విసుగు కలిగిస్తుంది.