మాజీ మావోయిస్టులకు ఉపాధి అవకాశాలు

వరంగల్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో లొంగి పోయిన మాజీ మావోయిస్టులకు తీపి కబురు చెప్పారు డీజీపీ సీవీ ఆనంద్. మాజీ మావోయిస్టులతో సమావేశం అయ్యారు. గృహ వసతి, న్యాయ సహాయం, ఉపాధి అవకాశాలు , ఆర్థిక సహాయానికి సంబంధించిన వారి సమస్యలు, విజ్ఞప్తులను విన్నారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని , వారికి సాధ్యమైనంత మేర సహాయం అందిస్తానని వారికి హామీ ఇచ్చారు డీజీపీ సీవీ ఆనంద్. ఉపాధి పొందడానికి అంతే కాకుండా స్థిరమైన జీవితాన్ని నిర్మించు కోవడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడానికి తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
తెలిసో తెలియకో పరిస్థితుల కారణంగా గతంలో నక్సలైట్లుగా మారారని, బుద్ది తెచ్చుకుని జన జీవన స్రవంతి లోకి వచ్చారని దీనికి సర్కార్ మద్దతు ఇచ్చిందన్నారు డీజీపీ. అలాగే, అనుమానాస్పద లేదా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటూ, ప్రధాన స్రవంతి సమాజంలో పూర్తిగా కలిసి పోవాలని సూచించారు. ఈ సందర్భంగా వారికి ఆరోగ్య కార్డులను పంపిణీ చేశారు డీజీపీ. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ‘లొంగుబాటు , పునరావాస విధానం’లో భాగంగ ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులకు ప్రోత్సాహక నగదుకు సంబంధించిన చెక్కులను కూడా అందజేశారు.