newsseals.com
ENTERTAINMENT

‘విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్’ లో ఆక‌ట్టుకున్న సూర్య , బైజు

Posted by: VijayaBhaskar August 13, 2026
newsseals-VishwanathAnndSons

హైద‌రాబాద్ : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సూర్య‌కు ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది. ఏది చేసినా దానికో అర్థం ప‌రమార్తం ఉండేలా చూసుకుంటాడు. తాను చేసే పాత్ర‌కు వంద శాతం న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తాడు. తాజాగా త‌ను న‌టించిన విశ్వ‌నాథ‌న్ అండ్ స‌న్స్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గ‌తంలో గజిని సినిమాలో సంజయ్ రామస్వామిగా ఆకట్టుకున్న సూర్య ఇప్పుడు సంజయ్ విశ్వనాథ్‌గా మరోసారి అద్భుతమైన నటనతో మెప్పించాడు. ఫస్ట్ హాఫ్‌లో సూర్య, రాధిక, మమిత బైజు మధ్య వచ్చే ఫ్యామిలీ డ్రామా చాలా ఆక‌ట్టుకునేలా ఉంది. మరీ ముఖ్యంగా మమిత బైజు చాలా ఫ్రెష్‌గా, యాక్టివ్‌గా కనిపిస్తూ.. తన క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యింది.

సెకండ్ హాఫ్‌లో అత్తారింటికి దారేది, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలను గుర్తు చేసే ఎమోషన్స్‌తో దర్శకుడు ఫ్రెష్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ తర్వాత ఇప్పుడు సరికొత్త కథతో విశ్వనాథ్ & సన్స్ లో.. డైలాగ్స్ , స్క్రీన్‌ప్లే అద్భుతంగా రాశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ సినిమాను చాలా రిచ్‌గా నిర్మించారు. చాలా కాలం తర్వాత ప్రేక్షకులను కంటతడి పెట్టించేంత బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. మొత్తంగా కుటుంబం మొత్తం కలిసి తప్పకుండా చూడాల్సిన సినిమా విశ్వ‌నాథ‌న్ అండ్ స‌న్స్. ఇలాంటి సినిమాలు మ‌రిన్ని రావాల‌ని కోరుకుందాం.