newsseals.com
News

బీసీ హాస్టళ్ల అభివృద్దికి ప్రత్యేక దృష్టి : స‌విత

Posted by: VijayaBhaskar August 18, 2026
newsseals-Savitha

అమ‌రావ‌తి : బీసీ హాస్టళ్లలో 90,676 మంది విద్యార్థులు చదువుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హాస్టళ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సవిత తెలిపారు. సీఎస్ఆర్, డిస్ట్రిక్ మినరల్ ఫండ్స్ ద్వారా హాస్టళ్ల మరమ్మతులు చేపట్టామన్నారు. పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న హాస్టళ్లను వేరే భవనాల్లోకి షిఫ్ట్ చేశామన్నారు. మరికొన్నింటిని గుర్తించామని, వాటిని కూడా త్వరలో షిఫ్ట్ చేస్తామని తెలిపారు. హాస్టళ్లలో మౌలిక వసతులకు అధిక ప్రాధాన్య ఇస్తున్నామని, సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు, ఇనర్వర్టర్లు, దోమ తెరలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎఫ్ఆర్ఎస్ విధానం ప్రవేశపెట్టి వార్డెన్లు, విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగు పరిచామన్నారు. హాస్టళ్లలో పారిశుధ్య నిర్వహణకు 1,291 మంది పారిశుధ్య సిబ్బందిని, 142 మంది కుక్, కమాటీలను నియమించామని తెలిపారు.

2026-27 బడ్జెట్ లో హాస్టళ్ల మరమ్మతులకు రూ.20 కోట్లు కేటాయించామన్నారు స‌విత‌. 2019-24 మధ్య ఆనాటి ప్రభుత్వం హాస్టళ్ల కనీస మరమ్మతులకు, వసతులకు నిధులు కూడా కల్పించలేదని ఆరోపించారు. రూ,.9.75 కోట్లతో భీమిలి బీసీ గురుకుల పాఠశాలకు అదనపు భవనం నిర్మిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఈ భవనానికి సంబంధించి అంచనాలు కూడా ఇప్పటికే రూపొందించామని, అనుమతులు రాగానే నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో భీమిలి ఎంజేపీ సహా 70 నుంచి 80 శాతం మేర అసంపూర్తి గా నిలిచిపోయిన ఎంజేపీ భవనాల నిర్మాణాల పూర్తికి కూటమి ప్రభుత్వం రూ.80 కోట్లు కేటాయించిందన్నారు. ఆరు నెలల్లో ఈ ఎంజేపీ భవనాలను బీసీ బిడ్డలకు అంకితం చేస్తామని మంత్రి సవిత తెలిపారు.