newsseals.com
News

టీపీబీఓపై సీఎంసీ కమిష‌న‌ర్ స‌స్పెన్ష‌న్ వేటు

Posted by: VijayaBhaskar August 23, 2026
newsseals-CMCCommisssioneer

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని అంజయ్య నగర్ భవన కూల్చివేత ఘటన క‌ల‌క‌లం రేపింది. ఈ సంఘ‌ట‌నకు సంబంధించి సీఎంసీ క‌మిష‌న‌ర్ జి. శ్రీ‌జ‌న సీరియ‌స్ అఅయ్యారు. ఈ సంద‌ర్బంగా ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన టీపీబీఓపై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. ఆగ‌స్టు 22న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం CMC కమిషనర్ జి. శ్రీజన, మాదాపూర్ సర్కిల్ 50కి చెందిన TPBO యు. సంతోష్ కుమార్‌ను తక్షణమే అమల్లోకి వచ్చేలా సస్పెండ్ చేశారు. గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌లో కూలిపోయిన ఏడు అంతస్తుల భవనం యొక్క అనధికారిక నిర్మాణాన్ని అడ్డుకోవడంలో విఫలమైనందుకు ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ఒక టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్‌ (TPBO)ను సస్పెండ్ చేసింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. సదరు అధికారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్లు, ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆయన సస్పెన్షన్‌లోనే ఉంటారని CMC క‌మిష‌న‌ర్ పేర్కొంది. కమిషనర్ ముందస్తు అనుమతి లేకుండా తన ప్రధాన కార్యాలయాన్ని (హెడ్‌క్వార్టర్స్) విడిచి వెళ్లకూడదని కూడా ఆ అధికారిని ఆదేశించారు. నిబంధనల ప్రకారం ఆయనకు జీవన భృతి (subsistence allowance) చెల్లించ బడుతుంది.