గాంధీ భవన్ లో సీఎం పీఆర్ఓ ప్రత్యక్షం

హైదరాబాద్ : రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏపీకి చెందిన అధికారులే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణకు చెందిన ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి, ఆత్మ గౌరవానికి తీరని భంగం వాటిల్లుతోందని తెలంగాణ వాదులు, ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. మరో వైపు గాంధీ భవన్‌లోని పనుల కోసం ప్రభుత్వ అధికారులను వాడుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. రేవంత్ పాలనలో ప్రభుత్వ యంత్రాంగం , అధికారులను ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారో చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ.
రాష్ట్ర ప్రభుత్వం నుండి జీతం తీసుకునే ముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) డాక్టర్ మల్సూర్ గాంధీ భవన్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారని సమాచారం. అక్కడ ఆయన కాంగ్రెస్ నాయకులకు టీవీ చర్చల్లో ఏం మాట్లాడాలి, ప్రత్యర్థి పార్టీలను రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలపై దిశా నిర్దేశం చేశారు. ఉమ్మడి రాష్ట్రం యొక్క 60 ఏళ్ల చరిత్రలో గానీ, లేదా 10 ఏళ్ల BRS పాలనలో గాని ముఖ్యమంత్రికి చెందిన CPROలు ఇలా రాజకీయ పార్టీ కార్యాలయాల సమావేశాలకు హాజరైన దాఖలాలు లేవు. రేవంత్ ప్రభుత్వం డాక్టర్ మల్సూర్ వంటి సీనియర్ అధికారిని కూడా భ్రష్టు పట్టించిందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.