newsseals.com
News

ఏపీ స‌ర్కార్ కు ఊతం ఇచ్చేలా కేంద్ర బ‌డ్జెట్

VijayaBhaskar February 2, 2026
newsseals-APCM
Spread the love

స్పందించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయ‌యుడు

చిత్తూరు జిల్లా : కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ 2026-2027 పై స్పందించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు. కేంద్ర బ‌డ్జెట్ ఏపీ స‌ర్కార్ కు ఊతం ఇచ్చేలా ఉంద‌న్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఫార్వార్డ్ లుకింగ్ బడ్జెట్ అని పేర్కొన్నారు. ఈ బ‌డ్జెట్ అన్ని వ‌ర్గాల‌కు మేలు చేకూర్చేలా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు చంద్ర‌బాబు నాయుడు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను అభినందిస్తున్న‌ట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన అంశాల్లో మరింతగా దూకుడుగా వెళ్లేందుకు ఈ బడ్జెట్టు సహకరించేలా ఉందని చెప్పారు సీఎం.

రాష్ట్రం అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విదానానికి ఈ బడ్జెట్ మరింత సహకరించేలా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంఎస్ఎంఈలపై ఎక్కువగా దృష్టి సారించిందన్నారు. వీటిని మరింత బలోపేతం చేసుకునే అవకాశం వీలు క‌లుగుతుంద‌ని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు.
మహిళలు, రైతులు, యువత సాధికారిత సాధించేలా బడ్జెట్ ఉందన్నారు. 2047 వికసిత్ భారత్ డెవలప్డ్ ఎకానమీగా మారేందుకు ఇది ఉపయోగ పడుతుందన్నారు సీఎం. ఆర్ధిక మంత్రి బ్యాలెన్స్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. దిశ అండ్ గతి ఉపకరిచేలా బడ్జెట్ ఉందని పేర్కొన్నారు.