newsseals.com
News

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతాం

Posted by: VijayaBhaskar February 7, 2026
neewsseals-DamodaraRajaNarasmha

మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా : మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ స‌త్తా చాటుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ‌. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారం లో స్థానిక శాసన సభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలసి పాల్గోన్నారు .
ఎన్నికల ప్రచారం లో భాగంగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లోని 1వ , 6వ , 50వ , 51వ , 60 వ డివిజన్ లలో పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులతో పాదయాత్రగా ఇంటింటికీ తిరిగి మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రచారం నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు , పార్టీ శ్రేణులకు వివరించారు . ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత పార్టీలకు అతీతంగా రేషన్ కార్డులను ఇచ్చామన్నారు దామోద‌ర రాజ న‌ర‌సింహ‌ . సన్న బియ్యం , ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామన్నారు . మహిళ సాధికారతే లక్ష్యంగా మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నామన్నారు . మహబూబ్ నగర్ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రజలను కోరారు . మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని కార్యకర్తలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు .