newsseals.com
DEVOTIONAL

కల్పవృక్ష వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం

VijayaBhaskar February 21, 2026
newsseals-KalpavrikhaVahanam
Spread the love

అంగ‌రంగ వైభ‌వోపేతంగా వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభవోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కల్పవృక్ష వాహనంపై ఊరేగారు. నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు

క్షీర సాగర మథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు. పూర్వ జన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు. కాగా సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జ‌రిగింది. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు సర్వ భూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు.

వాహ‌న‌సేవ‌లో ఎల్ ఏసీ ప్రెసిడెంట్ ఏ వి రెడ్డి, అర్చకులు, ఏఈవో రమేష్, టెంపుల్ ఇన్పెక్టర్స్ నిరంజన్, శ్రీ హరికృష్ణ, పలువురు అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.