newsseals.com
ENTERTAINMENT

క‌ల‌ర్స్ 2.0 రూపంలో అత్యాధునిక సాంకేతికత‌

Posted by: VijayaBhaskar March 21, 2026
newsseals-EshaRebba

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన న‌టి ఈషా రెబ్బా

గాజువాక : మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలను అప్‌డేట్ చేస్తూ ‘కలర్స్ 2.0’ రూపంలో అత్యాధునిక సాంకేతికతను ప్రజలకు అందిస్తుండ‌డం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు న‌టి ఈషా రెబ్బా. యూఎస్-ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన టెక్నాలజీతో అధిక బరువు, హెయిర్, స్కిన్ సమస్యలకు అంతర్జాతీయ స్థాయి చికిత్సలను అందిస్తున్నామని వివరించారు. మేనేజింగ్ డైరెక్టర్ డా. విజయ్ కృష్ణ మాట్లాడుతూ, గాజువాక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. రెండు దశాబ్దాలకు పైగా అనుభవంతో నమ్మకాన్ని సంపాదించిన కలర్స్, ఇప్పుడు మరింత ఆధునిక సేవలను అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఆరోగ్యంగా, అందంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరికీ తమ సేవలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఆపరేషన్స్ డైరెక్టర్ కృష్ణంరాజు మాట్లాడుతూ కలర్స్‌ను ఉత్తమ వెల్నెస్ క్లినిక్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. బరువు తగ్గడం, ఆరోగ్య సంరక్షణ, అందం పరిరక్షణలో ప్రత్యేక సేవలను అందిస్తున్నామని చెప్పారు. దేశ వ్యాప్తంగా 51 మంది డెర్మటాలజిస్టులతో సేవలు అందిస్తున్న ఏకైక వెల్నెస్ సంస్థగా కలర్స్ ప్రత్యేకత సాధించిందని అన్నారు. ఎం మీడియా ఆధ్వర్యంలో జైదీప్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానిక యువత పాల్గొన్నారు.