newsseals.com
News

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

Posted by: VijayaBhaskar March 21, 2026
newsseals-YSJagan

తెలియ చేసిన మాజీ సీఎం జ‌గన్ మోహ‌న్ రెడ్డి

తాడేపల్లి గూడెం : ఏపీలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరం వద్ద గోదావరిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతైన ఘటనపై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. గోదావరిలో స్నానం చేసేందుకు దిగిన ఏడుగురు విద్యార్థుల్లో ఐదుగురు గల్లంతైన ఘటన పై ఆరా తీశారు. ఈ ఘటన విషాదకరమన్న ఆయన ఉన్నత భవిష్యత్ ఉన్న విద్యార్ధులు ఇలా మృతి చెందడం తనను తీవ్రంగా కలచి వేసిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మాజీ సీఎం.

వీరంతా అమరావతిలోని ఎస్ఆర్ఎం కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం మృతుల కుటుంబాలకు కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం మృతి చెందిన కుటుంబాల‌కు అండ‌గా నిల‌వాల‌ని , త‌క్ష‌ణ‌మే ఆర్థిక సాయం అందించాల‌ని కోరారు. త‌మ పార్టీ త‌ర‌పున కూడా ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.