newsseals.com
ENTERTAINMENT

ఆదిత్య ధ‌ర్ ధురంధ‌ర్ -2 క‌లెక్ష‌న్స్ రూ. 1365 కోట్లు

VijayaBhaskar March 30, 2026
newsseals-Dhurandhar2Colleectionss
Spread the love

వ‌సూళ్ల వేట‌లో సినీ ఇండ‌స్ట్రీలో రికార్డ్ ల మోత

ముంబై : ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్ తీసిన దురంధ‌ర్ -2 ది రివెంజ్ సీక్వెల్ మూవీ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. దురంధ‌ర్ -1 రూ. 1100 కోట్ల‌కు పైగా వ‌సూలు చేస్తే సీక్వెల్ మూవీ మార్చి 19న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. బాక్సులు బ‌ద్ద‌లు కొడుతోంది. రికార్డుల‌ను తిర‌గ రాస్తోంది. ఏకంగా బాక్సాఫీస్ వద్ద రూ. 1365 కోట్లు వసూలు చేసింది. సినీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. వారాంతంలో ప్రేక్షకుల సంఖ్య పెరగడం తో చిత్రి నిర్మాత‌లు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ సినిమా శుక్రవారం రూ. 42 కోట్లు, శనివారం రూ. 64 కోట్లు, ఆదివారం రూ. 71 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది.

“ధురందర్: ది రివెంజ్” విడుదలైన 11 రోజుల్లోనే భారతదేశంలో రూ. 1,023 కోట్ల మ్యాజిక్ నంబర్‌ను దాటింది. ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ నుండి మరో రూ. 342 కోట్లను రాబట్టింది. ₹1000 కోట్ల క్లబ్ అనేది ఎలైట్ జోన్,’ అని ఎం. ఎస్. రాజు అన్నారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్ , రాకేష్ బేడీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇది ధర్ దర్శకత్వం వహించిన 2025 నాటి “ధురందర్” చిత్రానికి సీక్వెల్. చిత్ర నిర్మాతలు తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక పోస్ట్ ద్వారా బాక్సాఫీస్ వసూళ్లను పంచుకున్నారు. ఆ పోస్ట్‌లో సినిమా పోస్టర్‌తో పాటు దానిపై వసూళ్లు రాసి ఉన్నాయి.