newsseals.com
News

ఎండ వేడిమి ఉంటే సెల‌వులు ప్ర‌క‌టించండి

VijayaBhaskar May 23, 2026
newsseals-CM
Spread the love

సీఎం చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో వ‌డ‌గాలులు వీస్తున్నాయి. దీంతో సీఎం స‌చివాల‌యంలో అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు. రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు, వడ గాలుల నుంచి రక్షణ పొందేందుకు సన్నద్ధత చర్యల పై ఆరా తీశారు. హీట్ వేవ్ పరిస్థితిని ఎదుర్కోనేలా ఎక్కడికక్కడ టెంట్లు, చలివేంద్రాలు, చల్లని నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎలాంటి నిర్ల‌క్ష్యం వ‌హించ వ‌ద్ద‌ని సూచించారు. ఎప్ప‌టిక‌ప్పుడు జిల్లా క‌లెక్ట‌ర్లు మానిట‌రింగ్ చేయాల‌న్నారు సీఎం.

అంతే కాకుండా సీఎం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా శెలవులు ప్రకటించేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎండల తీవ్రత, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా జిల్లా కలెక్టర్లు మీడియా సమావేశాలు నిర్వహించాలని నిర్దేశించారు. సమీక్షకు సీఎస్ సాయి ప్రసాద్, విపత్తు నిర్వహణ, వైద్యారోగ్య, పురపాలక, పంచాయితీరాజ్ శాఖ ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.