newsseals.com
DEVOTIONAL

యుద్ద ప్రాతిప‌దిక‌న ప‌నులు పూర్తి చేయాలి

VijayaBhaskar June 3, 2026
newsseals-AEOTTD
Spread the love

టీటీడీ అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి

తిరుమల : టీటీడీ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఇంజ‌నీరింగ్ ప‌నులు యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని ఆదేశించారు అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి. ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సమావేశం శ్రీ పద్మావతి అతిధి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో జరిగింది. ఇందులో భాగంగా ఆయన సివిల్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్‌కు సంబంధించిన పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు, కళ్యాణి చౌల్ట్రీస్ , సీఆర్ఓ లకు సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించారు.

తరువాత, ఎస్వీ మ్యూజియంకు సంబంధించిన అభివృద్ధి పనుల పురోగతిని కూడా ఆయన సమీక్షించారు. ఈ పనులన్నింటినీ నిర్దేశిత సమయం లోపల పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు . ఈ కార్యక్రమంలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, ఎస్ఈ వేణుగోపాల్, ఈఈలు శ్రీనివాసరావు, సుధాకర్, డీఈ ఎలక్ట్రికల్ చంద్రశేఖర్, డిప్యూటీ ఈఓ హెల్త్ , చీఫ్ మ్యూజియం ఆఫీసర్ సోమన్ నారాయణ, డిప్యూటీ ఈఓ రిసెప్షన్ భాస్కర్, జీఎం ఐటీ వెంకటేశ్వర్లు నాయుడు, వీజీఓ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.