newsseals.com
News

కొత్త పార్టీ ఏర్పాట్లు చేస్తాన‌న్న అన్నామ‌లై

VijayaBhaskar June 5, 2026
newsseals-KAnnamalai
Spread the love

త‌న రాజీనామాను ఆమోదించిన బీజేపీ

చెన్నై : బీజేపీ మాజీ అధ్య‌క్షుడు కుప్పుస్వామి అన్నామ‌లై రాజీనామాను పార్టీ హైక‌మాండ్ ఆమోదించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. పార్టీ చీఫ్ నితిన్ న‌బిన్ త‌న ప్రాథ‌మిక స‌భ్య‌త్వాన్ని కూడా ర‌ద్దు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. దీంతో కె. అన్నామ‌లైకి బీజేపీకి మ‌ధ్య బంధం తెగి పోయింది ఇవాల్టి నుంచి. ఈ సంద‌ర్బంగా త‌న రాజీనామా విష‌యంలో పున‌రాలోచించు కోవాల‌ని సూచించారు ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ కీల‌క నేత బీఎల్ సంతోష్, నితిన్ న‌బిన్. కానీ కె అన్నామ‌లై ఒప్పుకోలేదు. దీంతో గ‌త్యంత‌రం లేక అన్నామ‌లై రాజీనామాను ఆమోదించ‌క త‌ప్ప‌లేదు.

మ‌రో వైపు బీజేపీ నేరుగా త‌మిళ‌నాడులో ప్ర‌వేశించ‌డం క‌ష్టంగా ఉంద‌ని, దీంతో కావాలనే అమిత్ షా ప్లాన్ లో భాగంగానే కె. అన్నామ‌లైతో పార్టీ పెట్టిస్తున్నాడ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ త‌రుణంలో ఇవాళ త‌న రాజీనామా ఆమోదించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు కె. అన్నామ‌లై. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడాడు. కొత్త పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించాడు.రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. బీజేపీ తరపున క్రమం తప్పకుండా వివిధ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన ఈ వ్యక్తికి, ఆ పార్టీ ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా కేటాయించలేదు.