newsseals.com
News

ఆక్వా రైతుల‌ను ప‌రామ‌ర్శించ‌నున్న జ‌గ‌న్

Posted by: VijayaBhaskar July 13, 2026
newsseals-YSJagan

తాడేప‌ల్లి గూడెం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్ర వైయస్ జగన్ జూలై 15న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప‌ర్య‌టించ‌నున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు శ్రీ వైయస్ జగన్ భీమవరం పర్యటన చేపడుతున్నారు. ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, విద్యుత్ ఛార్జీలు, ఎగుమతుల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్న పరిస్థితిని ఆయన పరిశీలించనున్నారు.

ఈ సందర్భంగా ఆక్వా రైతులను పరామర్శించి, వారి సమస్యలు, ఇబ్బందులు, నష్టాలపై నేరుగా వివరాలు తెలుసుకుంటారు. రైతుల ఆవేదనను విని వారికి ధైర్యం చెప్పడంతో పాటు, వారి సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. ఆక్వా రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై రైతులతో చర్చిస్తారు. రైతుల సమస్యలు, నష్టాలపై ప్రత్యక్షంగా వివరాలు సేక‌రిస్తారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం పట్టించుకోక పోవడం బాధాకరమని ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు జ‌గ‌న్ రెడ్డి.