బీఆర్ఎస్ గెలుపును ఏ శ‌క్తి అడ్డుకోలేదు

ధీమా వ్య‌క్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : ఆరునూరైనా స‌రే జూబ్లీహిల్స్ లో గెలిచేది తామేన‌ని, త‌మ విజ‌యాన్ని అడ్డుకునే శ‌క్తి ఏదీ లేద‌ని ప్ర‌క‌టించారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ అభ్య‌ర్థి మాగంటి సునీత గోపీనాథ్ త‌ర‌పున రోడ్ షో చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌సంగించారు. బీఆర్ఎస్ హ‌యాంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల‌లో అభివృద్ది జ‌రిగింద‌న్నారు. కానీ కాంగ్రెస్ స‌ర్కార్ వ‌చ్చాక ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు మొద‌లు అయ్యాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో విద్య‌, వైద్యం, ఐటీ, త‌దిత‌ర రంగాల‌ను బ‌లోపేతం చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు కేటీఆర్.
ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా మేలు చేశామ‌న్నారు. లెక్క‌లేన‌న్ని పరిశ్రమలు వచ్చాయ‌ని. ప్ర‌ధానంగా అభివృద్ధి ఎక్కువ‌గా జ‌రిగింద‌ని చెప్పారు.

2023 ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదన్నారు.జూబ్లీహిల్స్‌లో కూడా మాగంటి గోపినాథ్‌ను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తు చేశారు. నియోజకవర్గంలో మాగంటి గోపినాథ్‌ ప్రతి ఒక్కరికి అండగా నిలిచారని అన్నారు. దురదృష్టవశాత్తూ ఆరోగ్య సమస్యలతో గోపినాథ్ కన్నుమూశారంటూ వాపోయారు. మీరంతా మాగంటి సునీతను ఆశీర్వదించాలని కోరారు కేటీఆర్. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదని ఆరోపించారు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చారో మీరంతా ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కోరారు. అరచేతిలో స్వర్గం చూపిస్తూ 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన చూశారు రెండేళ్ల కాంగ్రెస్‌ పాలన చూస్తున్నార‌ని అన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *