ప్రైవేట్ కాలేజీల‌కు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

త‌మాషాలు చేస్తే చూస్తూ ఊరుకోనంటూ ఫైర్

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయ‌న ప్రైవేట్ కాలేజీల యాజ‌మాన్యాల‌కు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. స‌ర్కార్ తో ఆట‌లాడు కోవాల‌ని చూస్తే ఊరుకుంటామ‌ని అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లేన‌ని పేర్కొన్నారు. ఎవ‌రి ప్రోత్బ‌లంతో మీరంతా ఆందోళ‌న‌ల‌కు దిగారో త‌మ‌కు తెలుస‌న్నారు. ఇలాంటి చిల్ల‌ర వేషాలు వేస్తే బాగుండ‌ద‌న్నారు. తమాషాలు చేస్తే తాట తీస్తాన‌ని మండిప‌డ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఏది పడితే అది చేస్తే ఊరుకోవాలా అని నిల‌దీశారు. త‌మ ప్ర‌భుత్వం విడతల వారీగా నిధులు విడుదల చేస్తుంద‌ని, ఆ మాత్రం దానికి ఊరుకోమంటే ఎలా అని ఫైర్ అయ్యారు సీఎం.

విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించ బోమంటూ స్ప‌ష్టం చేశారు. మీరు ఆడిన‌ట్లు ఆడాలంటే ఇక్క‌డ కుద‌ర‌ద‌న్నారు. మీరు చెప్పిన‌ట్లు స‌ర్కార్ నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని అనుకోవ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇలాగే చేస్తూ పోతే చూస్తూ ఊరుకోన‌ని వార్నింగ్ ఇచ్చారు. కాలేజీలు మూసి వేస్తామంటే ఆయా కాలేజీల యాజ‌మాన్యాలు జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు. విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదన్నారు. విద్యార్థుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తే బాగుండ‌ద‌న్నారు. మీరు ఏ రాజకీయ పార్టీతో అంట కాగుతున్నారో మాకు తెలుసు అన్నారు. సంఘాలు అంటూ పైరవీల కోసమే వస్తున్నారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అరోరా కాలేజీ రమేష్‌కి ఎన్ని అనుమతులు ఇవ్వాల‌ని సీరియ‌స్ కామెంట్స్ చేశారు. సహకరించాల్సిన వాళ్లే కాలేజీలు బంద్‌ చేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వచ్చే ఏడాది ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దామ‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *