విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంది : గొట్టిపాటి

రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థినుల‌కు సైకిళ్ల పంపిణీ

అమ‌రావ‌తి : అన్నింటి కంటే విద్య గొప్ప‌ద‌ని, దానిని పొందితే ఎక్క‌డైనా వెళ్లి బ‌త‌క వ‌చ్చ‌ని అన్నారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంద‌ని, జీవితంలో అత్యంత ముఖ్య‌మైన‌ది ఈ బాల్య‌మేన‌ని, దీనిని స‌క్రమంగా వినియోగించు కోవాల‌ని సూచించారు విద్యార్థుల‌కు. మంగ‌ళ‌వారం జె.పంగులూరు మండలం ముప్పవరం గ్రామంలోని పీఎస్‌ఎన్ సీసీ జెడ్పీ పాఠశాలలో 110 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లను అంద జేశారు మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. అద్దంకి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 5,100కిపైగా విద్యార్థులు, విద్యార్థినులకు ఉచిత సైకిళ్లను అందజేయడం ఆనందంగా ఉందన్నారు.

దూరాభారంతో చిన్నారులు పాఠశాలలకు వెళ్లడంలో ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్ట‌డం జ‌రిగింద‌ని చెప్పారు గొట్టిపాటి ర‌వికుమార్. సీఎస్ఆర్ నిధులు, దాతలు, వ్యాపార సంస్థల సహకారంతో మరింత మంది విద్యార్థులకు సైకిళ్లు అందించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. సైకిళ్ల పంపిణీ అనంతరం పాఠశాలల్లో హాజరు శాతం పెరుగుతున్నట్టు గమనించడం సంతోషకరం అన్నారు. జాతీయ రహదారులపై సైకిళ్లతో ప్రయాణించే సమయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతే కాకుండా రహదారి పక్కనే సురక్షితంగా ప్రయాణం చేసే విధంగా విద్యార్థులను అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. విద్యార్థుల సైకిల్ ప్రయాణాలపై తల్లిదండ్రులు కూడా అవసరమైన జాగ్రత్తలు తెలియజేయాలని సూచించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *